![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -722 లో..... రాజ్ ని ఇంటికి పిలిచారని కావ్య ఇంట్లో వాళ్లపై కోపంగా ఉంటుంది. తనకి గతం గుర్తుచేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. మొన్నే కదా అలా అయిందని కావ్య కోప్పడుతుంది. రాజ్ కి మేమ్ ఏం చెప్పడం లేదు కదా.. కేవలం రాజ్ నీ వెనకాల తిరిగేలా చేస్తున్నాం.. ఆ యామిని అంటే వాడికి ఇష్టం లేదట.. నువ్వు అంటే ఇష్టం అంట.. నిన్ను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడని అపర్ణ అంటుంది.
చెప్పినట్లు ఎవరు పట్టించుకోవడం లేదని కావ్య బాధపడుతు వెళ్ళిపోతుంది. మరొకవైపు రాజ్ ఇంటికి వస్తాడు. ఎక్కడికి వెళ్ళావ్ బావ అని యామిని అడుగుతుంది. మన ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళానని రాజ్ చెప్పగానే యామిని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విషయం వెళ్లి తన పేరెంట్స్ కి చెప్తుంది. బావలో మార్పు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయం నా శత్రువుకి చెప్పాలని కావ్యకి యామిని ఫోన్ చేసి.. మా బావ తన ఫ్రెండ్స్ కి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళాడు.. అంటే నేనంటే అంటే ఇష్టమే కదా అని యామిని అంటుంది. రాజ్ నా దగ్గరికి వచ్చాడు. మా వాళ్ళని బుట్టలో పడేయ్యడానికి వచ్చాడని కావ్య అనగానే యామిని షాక్ అవుతుంది. రాజ్ నన్ను ఇంత మోసం చేశాడా అని యామిని కోపంగా ఉంటుంది.
మరొకవైపు సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, కావ్యని పిలిచి రాజ్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత కళ్యాణ్ భోజనం చెయ్యకుండా అప్పు కోసం వెయిట్ చేస్తాడు. దాంతో ధాన్యలక్ష్మి కోప్పడుతుంది. అప్పుడే అప్పు వచ్చి నాకు ఆకలిగా లేదు అనడంతో ధాన్యలక్ష్మి అప్పుని తిడుతుంది. మరొకవైపు కావ్య దేవుడికి మొక్కుకుంటూ బాధపడుతుంది. మరుసటిరోజు కావ్యని రాజ్ ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతాడు. తరువాయి భాగంలో కావ్య ఆఫీస్ కి వెళ్తానంటే వద్దని సుభాష్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఇక్కడికి వస్తున్నాడు కదా.. కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో చూసేలా చేస్తాను. దాంతో కావ్యకి పెళ్లి అయిందని రాజ్ అనుకుంటాడని యామినితో రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |